మండుటెండల్లో పనులు చేస్తున్న ఉపాధిహమీ కూలీలు పని ప్రదేశంలో నీడ, తాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రథమ చికిత్స పెట్టెలు కనిపించలేదు. దీనిపై ఈనెల 22న ‘ఉపాధిహమీ.. వసతుల లేమి’ శిర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈజీఎస్ అధికారులు కోలూరు, ఖర్బాలా గ్రామాల్లో పని ప్రదేశాల్లో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆరోగ్య శాఖ అధికారులు ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో ఉంచారు. దీంతో కూలీలు సాక్షి చొరవను అభినందించారు.– తానూరు
తానూరు మండలం కోలూరులో ఏర్పాటు చేసిన తాగునీరు
ఖర్బాలా గ్రామంలో పనిప్రదేశంలో ఏర్పాటు చేసిన తాగునీరు


