7న బీఎంఎస్‌ ద్వైవార్షిక మహాసభ | - | Sakshi
Sakshi News home page

7న బీఎంఎస్‌ ద్వైవార్షిక మహాసభ

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

● అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్‌: భూపాలపల్లిలో ఈనెల 7న బీఎంఎస్‌ 29వ ద్వైవార్షిక మహాసభ నిర్వహిస్తున్నట్లు యూనియన్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. గురువారం నస్పూర్‌ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్య అతిథులుగా బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి, సీఎంపీఎఫ్‌ ట్రస్టీ బోర్డు సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీకాల్‌ శ్రీనివాస్‌, ఏబీకేఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు పి.మాధవ నాయక్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సంరక్షణ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కోలిండియాలో కార్మికులకు చెల్లిస్తున్నట్లుగా అలవెన్స్‌లపై ఆదాయ పన్నును సంస్థనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మెడికల్‌ బోర్డు కొనసాగించాలని మెడికల్‌ ఫిట్‌ అయిన డిపెండెంట్లకు తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌ రెడ్డి, నాయకులు రాజారామ్‌, కిరణ్‌ కుమార్‌, కొమ్ము బాపు, కుమ్మరి చంద్రశేఖర్‌, కుంట రాజు, బద్దె ప్రభాకర్‌, చల్లశ్రీనివాస్‌, సామల కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement