ఆదిలాబాద్‌రూరల్: నకిలీ పత్రాలతో ప్లాట్ విక్రయించి మోసగించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు మావల సీఐ బిడి ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఆదిలాబాద్‌కు చెందిన కె.వేణుగోపాల్, బట్టిసావర్‌గాం గ్రామానికి చెందిన రత్నాల రాజన్న, విద్యానగర్‌కు చెందిన కేతిరెడ్డి కృష్ణరెడ్డి, డాక్యుమెంట్ రైటర్ మొహమ్మద్ ఫైజుద్దీన్ సిద్దిఖీ, రాంనగర్‌కు చెందిన దరాడే కేశవ్‌లు కుమ్మకై ్క జైనథ్ మండలానికి చెందిన పలమూరి జయప్రకాశ్‌కు మావల మండలం బట్టిసావర్‌గాం శివారు గల సర్వే నంబర్ 65లో నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుడు జయప్రకాశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రికార్డులను పరిశీలించగా నకిలీ పత్రాలు సృష్టించినట్లు విచారణలో తేలింది. డాక్యుమెంట్ రైటర్ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనతోపాటు మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన లావుడియా తిరుపతి(41) మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి బుధవారం రాత్రి బైక్‌పై బెల్లంపల్లి నుంచి పులిమడుగు గ్రామానికి వెళ్తున్నాడు. స్టేషన్ సమీపంలోని ఎంఎంసీసీ క్రికెట్ అకాడమీ వద్ద ఆకస్మాత్తుగా పంది అడ్డం రావడంతో తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. భార్య మహేశ్వరి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


