శ్రీరాంపూర్: మైనింగ్ స్టా్‌ఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శనివారం రాత్రి సీసీసీ కార్నర్‌లోని నర్సయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన డివిజన్ మైనింగ్ స్టాఫ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూన్‌లో జరిగే స్ట్రక్చరల్ సమావేశంలో మైనింగ్ స్టాఫ్ డిమాండ్లను యజమాన్యం ముందు పెట్టి చర్చిస్తామన్నారు. పదేళ్లుగా ప్రమోషన్ లేకపోవడం వలన అనేకమంది ఆందోళన చెందుతున్నారన్నారు. పనిభారం పెరిగిందని, ప్రమాదాలు జరిగితే మైనింగ్ స్టాఫ్‌ను బాధ్యులను చేస్తూ శిక్షిస్తున్నారన్నారు. సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, మైనింగ్ స్టాఫ్ ఉపాధ్యక్షుడు అద్దు శ్రీనివాస్, జీఎం చర్చల ప్రతినిధి గొర్రె నరసయ్య, పిట్ సెక్రెటరీలు గునిగంటి నర్సింగరావు, ఆకుల లక్ష్మణ్, మీడియా ప్రతినిధి రాజకుమార్, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, శివ, చంద్రమౌళి, దీక్షిత్, తదితరులు పాల్గొన్నారు.


