● విరిగిన విద్యుత్ స్తంభాలు ● ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు
నెన్నెల/మందమర్రిరూరల్: మండలంలోని జెండావెంకటాపూర్‌లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. 16 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. చిత్తాపూర్‌లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. గంగారాంలో సంకె రాకేష్ అనే రైతుకు చెందిన తూకం వేసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొత్తూర్‌లో ఎనుక పోశం ఇంటి ముందున్న తాటిచెట్లపై పిడుగుపడడంతో దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న బోరు మోటారు సాయంతో స్థానికులు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మందమర్రిలో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
నెన్నెల: జెండా వెంకటాపూర్‌లో విరిగిన స్తంభం
నెన్నెల: కొత్తూర్‌లో పిడుగుపడి దగ్ధమవుతున్న చెట్లు


