అన్నదమ్ముళ్ల అరుదైన ఘనత | - | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముళ్ల అరుదైన ఘనత

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

సాత్నాల: భోరజ్‌ మండలం గిమ్మ గ్రామానికి చెందిన రాజులవార్‌ యోగేశ్వర్‌–స్వప్న దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మణికంఠ స్వామి, చిన్న కుమారుడు దత్తాత్రి అగ్నివీరులుగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మణికంఠస్వామి ఆరు నెలల క్రితం ఎంపికై ప్రస్తుతం అస్సాంలో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు దత్తాత్రి ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్మీ ఉద్యోగం సాధించాడు. చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలని లక్ష్యంతో అన్నదమ్మళ్లు నిరంతర సాధనతో తమ కలలను సాకారం చేసుకున్నారు. దేశరక్షణలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నదమ్ముళ్లు తెలిపారు. దేశసేవలో కుమారులు పాల్గొనడం తమకు గర్వకారణమని తల్లిదండ్రులు తెలిపారు. వారిని గ్రామప్రజలు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement