కుటుంబంలోనే తొలి కొలువు.. | - | Sakshi
Sakshi News home page

కుటుంబంలోనే తొలి కొలువు..

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

సాత్నాల మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన ఎస్‌.గోపి–అనిత దంపతుల కుమారుడు సాయి శివప్రసాద్‌ది సామాన్య కుటుంబం. తండ్రి ఓ జనరల్‌ స్టోర్లో పనిచేస్తుండగా, తల్లి ప్రైవేట్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. తల్లిదండ్రుల శ్రమే ఆయన్ను లక్ష్యం వైపు సాగించింది. పాలిటెక్నీక్‌ పూర్తి చేసి శిక్షకుడు వీజీఎస్‌ రాకేష్‌ పర్యవేక్షణలో నిత్యం సాధన చేసి అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. కుటుంబంలో తొలి కొలువు దక్కింది. ప్రణాళికతో సాధన చేస్తే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చని సాయిశివప్రసాద్‌ చెబుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement