బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తి రిమాండ్‌

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

ఉట్నూర్‌రూరల్‌: బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరిలించినట్లు ఉట్నూర్‌ సీఐ ప్రసాద్‌ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉట్నూర్‌ మండలం లక్కారం గ్రామానికి చెందిన భూక్యా దేవానాయక్‌ జీసీసీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దేవానాయక్‌కు బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నిందితుడు కడుకుంట్ల పరుశురాం నమ్మించి ఖాళీ చెక్కులు తీసుకుని దుర్వినియోగం చేస్తూ రూ.1.87 లక్షలు కాజేశాడు. బాధితుడు దేవానాయక్‌ ఫిర్యాదుతో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. ఎస్సై విజయ్‌ తదితరులు ఉన్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి..

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసగిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినటు్‌ల్‌ సీఐ ప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నీలిశెట్టి సాయిరాం విప్రో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు వసూళ్లు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఉట్నూర్‌ బోయవాడకు చెందిన పెందుర్‌ కృష్ణవేణు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement