పట్టుబడిన వాహనం స్పేర్స్‌ మాయం! | - | Sakshi
Sakshi News home page

పట్టుబడిన వాహనం స్పేర్స్‌ మాయం!

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

మంచిర్యాలక్రైం: కలప అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వాహనాలను అటవీ అధికారులు జిల్లాకేంద్రంలోని ఆశాఖ డివిజన్‌ కార్యాలయానికి తరలిస్తారు. వాహనాలకు సంబంధించి యాజమానులు రాకపోవడంతో ఇలా పక్కనే పడేశారు. బైక్‌ల ముందు భాగం చక్రాలు కనిపించకపోవడంతో ఆదివారం ‘సాక్షి’క్లిక్‌ మనిపించింది. చక్రాలు లేకుండానే స్వాధీనం చేసుకున్నారా.? లేక వీటిని ఎవరైన మాయం చేశారా, అనేది అధికారులే తేల్చాల్సి ఉంది. ఇలా పట్టుబడిన వాహనం ఏదైన సరే స్పేర్స్‌ మాయం కావల్సిందేనా?

స్తంభం విరిగిపడి మూడు మేకలు మృతి

బెల్లంపల్లి: మున్సిపాలిటీ 13వ వార్డు గొల్లగూడెంలో ఆదివారం జోరువానకు విద్యుత్‌ స్తంభం విరిగిపడి చిప్ప గట్టయ్యకు చెందిన మూ డు మేకలు మృత్యువాతపడ్డాయి. కౌన్సిలర్‌ దొంగల రాజ్‌ కుమార్‌ వెంటనే స్పందించి విద్యుత్‌, పశు సంవర్థక శాఖ అధికారులకు సమాచారం అందించి ఘటనస్థలికి రప్పించారు. మృతి చెందిన మేకలకు పంచనామా నిర్వహించారు. బాధితుడికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కౌన్సిలర్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement