పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలి

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాలక్రైం: కమిషనరేట్‌ పరిధిలోని పోలీసుస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శనివారం ఆయన కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్ష, కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశం వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన కేసుల్లో అరెస్టులు, విచారణ, సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. రేషన్‌ బియ్యం, పేకాట, గుడుంబా, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని అన్నారు. నేరస్తులకు శిక్ష పడితే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపారు. కోర్టు వారెంట్ల జారీలో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కోర్టు కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్‌, భీ.రాంరెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు ప్రకాష్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, నాగేంద్ర, కృష్ణ, శ్రీనివాస్‌ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement