చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ గోల్డ్‌లోన్ బాధితులు శనివారం బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ బ్యాంకులో చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారని, తమకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏం చేసుకుంటారో చేసుకోండని ఆర్‌ఎం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి గత ఆగస్టు నుంచి నేటి వరకు వడ్డీ మాఫీ చేసి రుణం చెల్లిస్తే నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డ్‌లోన్ బాధితులు సాధనబోయిన కృష్ణ, గొడిసెల సంపత్‌రెడ్డి, నల్లకుంట అశోక్, తిరుపతిరెడ్డి, ఆకుల తిరుపతి, బీరం సతీశ్, సమ్మయ్య నాయక్, జడల మల్లేశ్, ఆర్‌ఎంపీ సంపత్ పాల్గొన్నారు.


