మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి.అన్వేష్‌ను కొనసాగిస్తూ సీడీఎంఏ సెక్రెటరీ డాక్టర్ టీ.కే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30న కమిషనర్ల బదిలీల్లో భాగంగా జి.అన్వేష్‌ను వేములవాడకు, ఆదిలాబాద్ కమిషనర్ జి.రాజును మంచిర్యాల కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇద్దరూ వారి వారి మున్సిపాలిటీల్లోనే నెల రోజులుగా పనిచేస్తుండగా, బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేశారు. అన్వేష్‌ను మంచిర్యాలలోనే కొనసాగిస్తూ, జి.రాజును మంచిర్యాల అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మంచిర్యాల అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్‌ను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.


