విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

విద్య

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి

భీమారం: పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూ ర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. శ్రద్ధగా చదివి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణతకు కృషి చేయాలని చెప్పారు. అనంతరం దాంపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. సర్పంచ్‌ చేగొండ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి వేముల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తకు సన్మానం

దండేపల్లి: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని గుడిరేవు ఉన్నత పాఠశాలలో దండేపల్లికి చెందిన ఇస్త్రో శాస్త్రవేత్త మల్లూరి ఆదిత్యను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అంతరిక్ష పనితీరును వివరించారు. రాకెట్లను అంతరిక్షంలోకి పంపడం, వాటి పనితీరు, అవి సమాచారాన్ని సేకరించి భూమి మీదకు ఎలా చేరవేస్తాయో తెలియజేశారు. పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి 1
1/1

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement