డిప్యూటీ రేంజ్‌ అధికారి కలప తరలిస్తూ పట్టుబడి.. | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ రేంజ్‌ అధికారి కలప తరలిస్తూ పట్టుబడి..

Feb 21 2026 6:55 AM | Updated on Feb 21 2026 6:55 AM

డిప్యూటీ రేంజ్‌ అధికారి   కలప తరలిస్తూ పట్టుబడి..

డిప్యూటీ రేంజ్‌ అధికారి కలప తరలిస్తూ పట్టుబడి..

చింతలమానెపల్లి: మండలంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి కలపను అక్రమంగా తరలిస్తూ పట్టుబ డ్డాడు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మా రింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్జెల్లి రేంజ్‌ పరిధిలోని గంగాపూర్‌ పంచా యతీ అంబగట్ట గ్రామంలో గురువారం రాత్రి సమయంలో ట్రాక్టర్‌ శబ్ధం రావడంతో స్థానికులు గమనించి ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. తనిఖీ చేయగా ట్రాలీలో టేకు కలప దుంగలు లభ్యమయ్యాయి. అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని కలప, ట్రాక్టర్‌ను ఖర్జెల్లి రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. బాలాజీఅనుకోడ సెక్షన్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి హైమావతి.. కలపను తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఆ సమయంలో డి ప్యూటీ రేంజ్‌ అధికారితోపాటు ఆమె భర్త ఉన్నట్లుగా తేలింది. రణవెల్లి గ్రామంలోని కలప సా మాన్లు తయారుచేసే వ్యక్తి వద్దకు తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఖర్జెల్లి రేంజ్‌ అధికారి సు భాష్‌ను వివరణ కోరగా, డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఆమె భర్త శివకుమార్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌ విలాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement