కమ్మనైన అమ్మ భాష
ఆదిలాబాద్: మాతృభాషలోని మాధుర్యం..మరే భాషలోనూ కనిపించదు. ప్రతి చిన్నారి అమ్మ భాషలోనే అనంతమైన జ్ఞానాన్ని సంపాదిస్తుంది. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా, విద్యార్థి మాతృభాషలో విద్యనభ్యసిస్తేనే ప్రతి విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎన్నో పరిశోధనలు తేటతెల్లం చేశాయి. భారత ఉపఖండంలో ఏ భాషకదే తనకంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఎన్నో భాషలు ఉన్న భారత ఉపఖండంలో దేనికదే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పాశ్చాత్య ప్రభావంతో స్థానిక భాషల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాతృభాష ప్రాధాన్యత తెలియజేయాలనే ‘యునెస్కో’గుర్తించింది. 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి ఏటా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
నేపథ్యం..
1947లో పాకిస్తాన్ దేశంగా ఏర్పడినప్పుడు, ప్రభు
త్వం ఉర్దూ భాషను అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ప్రజల మాతృభాష బెంగాలీ. దానికి సమాన గౌరవం ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. 1952, ఫి బ్రవరి 21న ఢాకాలో విద్యార్థులు శాంతి యుత ప్రదర్శన చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు ప్రా ణాలు కోల్పోయా రు. మాతృభాష కోసం ప్రాణాలర్పించడాన్ని గుర్తి స్తూ యూనెస్కో 1999లో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
యునెస్కో నివేదిక ప్రకారం..
లాంగ్వేజ్ మ్యాటర్స్, గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీ లిం
గ్వల్ ఎడ్యుకేషన్ అనే నివేదికను వెలువరించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు అర్థం కాని భాషలో విద్య అభ్యసిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతీ రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోంది. ఫలితంగా ఆ భాషతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వం కూడా అంతమైపోతోందని వివరించింది. ప్రాథమిక విద్యలో కనీసం 6 నుంచి 8 ఏళ్లవరకు మాతృభాషలోనే బోధన సాగాలని యునెస్కో సూచించింది.
‘తల్లి గర్భం నుంచి బయట పడగానే ఏ ఏడుపు ఏడ్చావో.. అదే నీ భాష. పరభాష జ్ఞానం కోసం నేర్చుకో, కా నీ మాతృభాషను ప్రాణం కోసం కాపాడుకో. తెలు గువాడవై ఉండి మాట్లాడకపోవడం నీకు సిగ్గుచేటు. సొంత భాషను నిర్లక్ష్యం చేయడం అంటే నీ అస్తిత్వాన్ని నువ్వే చంపుకోవడం. ఏ భాషలోనైనా పాండిత్యం సంపాదించు, కానీ భావవ్యక్తీకరణకు మా త్రం నీ కన్నతల్లి లాంటి మాతృభాషనే శరణ్యం.’– ప్రజాకవి కాళోజీ
నారాయణరావు
‘ఏ భాషకై నా దానికి సంబంధించిన యాసలోనే అసలైన అందం, మాధుర్యం ఉంటాయి. పరభాషలో ఎంతటి పాండిత్యం సంపాదించినా, మన అంతరంగంలోని లోతైన భావాలు సహజంగా వ్యక్తపర్చడానికి మాతృభాషనే శరణ్యం. భాష అనేది ఒక జాతి సంస్కృతికి, చరిత్రకు సజీవ ప్రతిబింబం. మాతృభాషను మర్చిపోవడం అంటే మన మూలాలు, అస్తిత్వాన్ని మనమే కోల్పోవడమే.’– సామల సదాశివ మాస్టర్


