భయమేస్తోంది
పంట పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. గుట్ట ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. ఇప్పటికే పలువురి కంటపడింది. ఒంటరిగా వెళ్లాలంటే భయమేస్తోంది. రాత్రివేళ పంట పొలాలకు వెళ్లలేకపోతున్నాం. గుంపుగా వెళ్లి పని చేసుకుని తిరిగి వస్తున్నాం.
– మహేశ్, రైతు, ఎల్వీ
అప్రమత్తంగా ఉండాలి
సిరాల గుట్టల్లో చిరుత ఉంది. అక్కడి గుహల్లో పిల్లతోపాటు తల్లి చిరుత ఉంది. ఇటీవల జరిగిన దాడిలో వివరాలు సేకరించాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గొర్రెలు, పశువుల కాపర్లు కలిసే వెళ్లి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
– రమేశ్, అటవీశాఖ రేంజ్ అధికారి


