‘సర్వదేవతల మంగళహారతులు’ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘సర్వదేవతల మంగళహారతులు’ ఆవిష్కరణ

Jan 19 2026 4:41 AM | Updated on Jan 19 2026 4:41 AM

‘సర్వదేవతల మంగళహారతులు’ ఆవిష్కరణ

‘సర్వదేవతల మంగళహారతులు’ ఆవిష్కరణ

మంచిర్యాలఅర్బన్‌: సాహితీ సంరక్షణ సమితి, సంగీత సాహిత్య సుధావాహిని సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సరస్వతీ శిశుమందిర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవి యెర్రోజు వెంకటరాయశర్మ రచించిన సర్వదేవతల మంగళహరతులు పుస్తకాన్ని ఆదివారం శతావధాన మారేపల్లి వెంకటరమణ పట్వర్థన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయా సంసారాన్ని దాటేందుకు భక్తియే ఏకై క మార్గమన్నారు. ఆత్మశుద్ధిగా పూజిస్తే దైవం సాక్షాత్కరించగలడన్నారు. రచయిత మనసా, వాచ, కర్మణ నిత్యం భగవంతుని సన్నిధిలో తరిస్తూ సర్వభక్త జనుల శ్రేయస్సును కాంక్షిస్తూ సర్వదేవతల మంగళహారతులను అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కవుల కవితాగానం అలరించింది. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి వామన్‌రావు, విశ్వంభరశర్మ, శ్రీనాథ్‌గౌడ్‌, రాజిరెడ్డి, దక్షిణామూర్తి, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement