నేడు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన
న్యూస్‌రీల్
చెన్నూర్: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉద యం 10:30 గంటలకు చెన్నూర్‌లో రూ.42.50 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి భూమిపూజ, 11:30 గంటలకు 16 వార్డులోని కొత్తగూడెం కాలనీలో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ, 12 గంటలకు కొత్తగూడెం కాలనీ నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు రూ.1.40 కోట్లతో చేపట్టిన బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన, 12:30 గంటలకు 9వ వార్డులో రూ.18.50 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డుకు శంకుస్థాపన, ఒంటిగంటకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గ సర్పంచులతో పరిచ య కార్యక్రమం. సాయంత్రం 3 గంటలకు మందమర్రి మున్సిపాలిటీలో ఇందిరాశక్తి సంబరాలు, 4 గంటలకు నేషనల్ హైవే నుంచి నార్లపూర్ స్కూల్ వరకు రూ.కోటి నిధులతో చేపట్టిన సీసీరోడ్డు, 4:20 గంటలకు 23వ వార్డులో లిటిల్ పవర్ స్కూల్ నుంచి దుర్గం ప్ర భాకర్ ఇంటి వరకు రూ.10 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు, 4:40 గంటలకు 21వ వార్డులోని పో చమ్మ ఆలయం నుంచి చాకలి సది ఇంటి వరకు రూ.12 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, సాయంత్రం 5 గంటలకు 15వ వార్డులోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి శ్రీపతినగర్ వరకు రూ.కోటి నిధులతో చేపట్టిన డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
కాలీకోమ్ వాయిస్తున్న పర్ధాన్ కితకు చెందిన మెస్రం రాము
నాగోబాకు మొక్కుతున్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు బొజ్జు, అనిల్‌జాదవ్, కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో, ఇతర అధికారులు
తపస్ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన బండి రమేశ్‌ను రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా, సయింపు శ్రీనివాసరావును అభిలేకన వింగ్ కన్వీనర్‌గా, ఎనగందుల రమాదేవిని మహిళా వింగ్ కోకన్వీనర్‌గా, ఐలాపురం విద్యాసాగర్‌ను వెబ్‌సైట్ వింగ్ కన్వీనర్‌గా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు.
నేడు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన
నేడు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన
నేడు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన
నేడు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన


