ఆత్మలకు ఓట్లు
చెన్నూర్: చెన్నూర్ బల్దియాలో అధికారులు ఆత్మలకు ఓటుహక్కు కల్పించారు. మున్సిపల్ అధికారులు ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో మృతుల ఓట్లు ఉండడం గమనార్హం. ఓటరు జాబి తాలు పరిశీలించిన ఆయా వార్డుల ప్రజలు ఆత్మలు వచ్చి ఎలా ఓట్లు వేస్తాయని చర్చించుకుంటున్నా రు. తొలి జాబితాలో ఉన్న పొరపాట్లను సరిచేసి తప్పులు లేని జాబితాను విడుదల చేయాలని ఎన్ని కల సంఘం అధికారులను ఆదేశించింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం తుంగలో తొక్కి తప్పుల తడకలతో కూడిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. వార్డుల వారీ గా ఓటరు జాబితాలను పరిశీలించిన రాజకీయ పార్టీల నాయకులు అధికారుల తీరు పట్ల అసహ నం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఓటరు పేరు రెండు నుంచి మూడు వార్డుల్లో ఉండగా గతేడాది మృతి చెందిన మృతుల పేర్లు సైతం జాబితాలో ఉన్నా యి. వార్డుకు 900 నుంచి వెయ్యి మంది ఓటర్లు ఉండగా 25 నుంచి 30 వరకు మృతుల ఓట్లు ఉన్నాయి.
జాబితాలో ఆత్మలకు ఓట్లు..
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా చెన్నూర్ మున్సిపల్ అధికారులు ఈ నెల 10న 18 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేశారు. 19,903 మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 400లకు పైగా మృతుల ఓట్లు ఉన్నాయి. మున్సిపాలిటీ ద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుండగా ఏడాదిలో ఎంతమంది మృతి చెందారనే జాబితా అధికారుల వద్ద ఉంటుంది. ఆ జాబితా ప్రకారం మృతుల ఓట్లను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ ఆత్మల పేర్లను ఓటరు జాబితాలో పొందుపర్చడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
18వ వార్డులో మృతుల ఓట్లు
18వ వార్డులో తంగెడిపల్లి సత్యనారాయణ, తంగెడిపల్లి అశోక్, ఓల్లాల లీలావతి, ఈశ్వర సత్యనారాయణ, చుక్కంగారి శంకర్‌బాబు, కాంతాబాయి బజాజ్, శివందారి చక్రధరదేవ్, కారింగుల గణపతి, బాలకిషన్ బజాజ్, ఇజాజ్ అహ్మద్, బొందుగుల రాజమౌళి, అక్కినపల్లి శారద, కొలిపాక సంతోశ్, శివకృష్ణమూర్తి మృతి చెందారు. మరో 15కు పైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నట్లు వార్డుకు చెందిన రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు ఓటరు జాబితాలో మృతుల పేర్లు తొలగించాలని బల్దియా ప్రజలు కోరుతున్నారు.


