దేశంలోనే నంబర్ వన్‌గా ఎస్టీపీపీ
జైపూర్: దేశంలోనే నంబర్ వన్‌గా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిలుస్తోందని, విద్యుదుత్పత్తి, నిర్వహణలో అత్యుత్తమ ప్లాంట్‌గా అనేక అవార్డులు అందుకోవడం సింగరేణీయులందరికీ గర్వకారణమని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ అడ్మిన్ భవన్ కార్యాలయంలో ఈడీ చిరంజీవి జీఎంలు నర్సింహారావు, మధన్‌మోహన్‌తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో 100మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతుందని తెలిపారు. బొగ్గుతోపాటు సంస్థ నూతనంగా ఎస్టీపీపీలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు సోలార్ విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్‌తో సంస్థ మరింత లాభాల్లోకి వెళ్తుందని తెలిపారు. భవిషత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి సంస్థ దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విస్తరిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ చాంచల్ సర్కార్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా, పీఎంపీఎల్ హెడ్ అఖిల్‌కపూర్, ఏజీఎంలు మురళీధర్, వేణుగోపాల్, శివప్రసాద్, డీజీఎం పర్సనల్ కిరణ్‌బాబు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉద్యోగులకు సన్మానం
ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న బేతి నాగరాజు (ఈఈ), ఎండీ మోబిన్ (అకౌంట్స్ ఆఫీసర్), మారెళ్ల సురేశ్ (సీనియర్ అసిస్టెంట్), ఉప్పగంటి రవితేజ (క్లర్క్)ను ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మధన్‌మోహన్ శాలువాలతో సన్మానించార. ప్రశంసాపత్రాలు అందించి బహుమతులతో సత్కరించారు.


