
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని భగవంతంవాడకు చెందిన నులిగొండ మల్లేశ్ కూతురు అనుషా (23) డిగ్రీ వరకు చదివి ఇంటివద్దే ఉంటోంది. నాలుగేళ్ల క్రితం డిగ్రీ చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న జైపూర్ మండలం కుందారంకు చెందిన రంగుల శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరుకావడంతో అనుషా తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదే అదనుగా భావించిన శ్రీకాంత్ నగలు, నగదు తెస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా తమవద్ద ఉన్న ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతికి కారణమైన రంగుల శ్రీకాంత్, తండ్రి కిష్టయ్య, తల్లి రాజేశ్వరి, అన్నయ్య రమేశ్‌పై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వెండి కిరీటం బహూకరణ
కుంటాల: ప్రాచీన శ్రీకృష్ణ దేవాలయంలోని కృష్ణుని విగ్రహానికి కుంటాల గ్రామానికి చెందిన చిప్ప కృష్ణవేణి–సాయినాథ్ సీనియర్ సైంటిస్ట్ దంపతులు ఆదివారం రూ.1.45 లక్షల విలు వైన వెండి కిరీటాన్ని బహూకరించారు. 12 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండితో కిరీటం తయారు చేయించినట్లు దాత తల్లిదండ్రులు గంగామణి, హన్మాండ్లు తెలిపారు.

మనస్తాపంతో యువతి ఆత్మహత్య