
రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు..
తాండూర్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొత్త గుడిసెల కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు గణపతి రాజయ్య (60) ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ కొత్తపల్లి వైపు వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దెబ్బటి శ్రావణ్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రాజయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రావణ్‌ను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
గుండెపోటుతో అంగన్‌వాడీ టీచర్..
ఉట్నూర్‌రూరల్: మండలంలోని రామ్ లింగంపేటకు చెందిన అంగన్‌వాడీ టీచర్ సీహెచ్ విజయ (64) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమగ్ర బాలభ్యుదయ పథకంలో కొన్ని దశాబ్దాలుగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం చాతిలో నొప్పివస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిందని ఆమె భర్త స్వామి తెలిపారు. పేద కుటుంబానికి చెందిన విజయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు..