
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆల య అర్చకులు వేకువజామున శ్రీమహాలక్ష్మీ, సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, హారతి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆలయంలో అమ్మవారి దర్మనానికి బారులు తీరా రు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న నిర్వహించనున్న పరీక్షకు ఈ నెల 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.