
ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందిద్దాం
● గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ ● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
పాతమంచిర్యాల: అడవులనే ఆయువు పట్టుగా చేసుకుని జీవం సాగించే ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని, విద్య, వైద్యం అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. గిరిజన మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, జిల్లాలోని ప్రతీ గిరిజన ప్రాంతానికి రోడ్డు రవాణా వసతి కల్పించి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. నాయకులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా గిరిజన బాలికలు కలెక్టర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి వైశ్యభవన్ సభా ప్రాంగణం వరకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీటీడీవో జనార్ధన్, ప్రో గ్రాం కన్వీనర్ అలం బాపు, గిరిజన నాయకులు జేక శేఖర్, అడ జంగు, సోయం జంగు, భార్గవ్, రా జ్‌కుమార్, పెంద్రం హన్మంతు, ఆత్రం రవీందర్, చిలుకయ్య, మడావి శంకర్, నైతం లక్ష్మణ్, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.