
చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆటో
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని హరితవనం పార్కు సమీపంలో చెట్ల పొదల్లోకి ఆటో దూసుకెళ్లి బోల్తా పడింది. సిర్పూర్ మండలం చిలాటిగూడకు చెందిన ప్రయాణికులు మహారాష్ట్రలోని మహుర్ గ్రామానికి దైవదర్శనం కోసం ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మావల సమీపంలో ఆటో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవ్‌రావు, మారుతి, మంగావతి, నాగోబాయికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కిషన్, పైలట్ ముజఫర్ క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.