
ఈవో కార్యాలయం ప్రారంభం
బాసర: బాసర ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆలయ కార్యనిర్వహణాధి కారి కార్యాలయాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గోమాతతో భవన ప్రవే శం, వాస్తుపూజ, మహా హోమంతో పాటు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి నూ తన కార్యాలయంలో అధికారులంతా విధులు నిర్వహిస్తారని ఆలయ ఏఈవో సుదర్శన్ గౌడ్ తెలిపారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పా ఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆల య సీనియర్ అసిస్టెంట్లు, పీఆర్‌వో నారాయణ పటేల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కొండచిలువ కలకలం..
ఆసిఫాబాద్‌అర్బన్: పట్టణంలోని దస్నాపూర్ కాలనీలో శుక్రవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన చెందిన స్థానికులు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌కుమార్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారి సిబ్బందిని అప్రమత్తం చేసి కాలనీకి పంపించారు. జిల్లా అటవీశాఖ అధికారి సీసీ ఇసాక్ ఆధ్వర్యంలో బీట్ అధికారులు కిషోర్, ఎం.వెంకటేష్, మారుతి, పి.వెంకటేష్ గంటపాటు శ్రమించి దానిని ఒక సంచిలో బంధించి అటవీప్రాంతంలో వదిలేశారు. సమయానికి స్పందించిన అటవీ శాఖ అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.