
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం బొప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మూత్రశాలలు, హాజరుపట్టిక పరిసరాలను పరిశీలించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తయారు చేయాలని ఎస్‌వో హరితను ఆదేశించారు. తహసీల్దార్ రాఘవేందర్‌రావు, కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
అమృత్ 2.0 పనులు పూర్తి చేయండి
చెన్నూర్: అమృత్ 2.0 పథకంలో నిర్మిస్తున్న ట్యాంక్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ట్యాంక్ పనులను పరిశీలించారు. పనులు పూర్తయ్యే వరకు ఇంటింటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని సూచించారు.