
చిరస్మరణీయుడు జయశంకర్ సార్..
● ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
మందమర్రిరూరల్: తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ కూడలి ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని గురువారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. పోరాటాలు, ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాయకులు ఆగం పట్టిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు డబ్బు సంచులతో దొరికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే నెపంతో కేసీఆర్‌ను జైలుకు పంపించే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
రామకృష్ణాపూర్: తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, రాష్ట్రాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ప్రజలు బీఆర్‌ఎస్ పక్షాన నిలవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గురువారం ఆర్‌కేపీలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. సూ పర్‌బజార్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 నెలల కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా మోసమే అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన గా లికొదిలేసి తరచూ ఢిల్లీకి వెళ్లడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్న తెలంగాణాను తిరిగి గాడిలో పెట్టేందు కు ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒ క్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రాజరమేశ్, కంభగోని సుదర్శన్‌గౌడ్, రామిడి కుమార్, తదితరులు పాల్గొన్నారు.