
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. గురువారం దండేపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసి వైద్యులు, రోగులతో మాట్లాడారు. మందుల నిల్వలపై ఆరా తీశారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం దండేపల్లి కేజీబీవీ, లింగాపూర్ మోడల్‌స్కూల్‌ను సందర్శించారు. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రతిభ, సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం లింగాపూర్ గ్రామంలో వర్షం కురుస్తుండడంతో గొడుగు పట్టుకుని డ్రెయినేజీలు పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధర్మరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ద్వారక ఉన్నత పాఠశాలను పరిశీలించారు. బీసీ హాస్టల్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏఈ బషీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రసాద్, ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.