
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి తెలపాలి
నస్పూర్: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తమ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వనం సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం సీసీసీలోని నర్సయ్య భవన్‌లో బీసీ హక్కుల సాధన సమితి మండల సమావేశం నిర్వహించారు. నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల గణన చేయకుండా 11 సంవత్సరాలుగా కాలయాపన చేస్తోందని విమర్శించారు. అనంతరం మండల అధ్యక్షుడిగా బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా జోగుల ఆంజనేయులు, కోశాధికారిగా కొత్తపల్లి మహేశ్, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను, 17 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టె కిషన్‌రావు, జోగుల మల్లయ్య, లింగం రవి, ముస్కె సమ్మయ్య, దొడ్డిపట్ల రవీందర్, సదానందం, పోశం, తదితరులు పాల్గొన్నారు.