
11న నులి పురుగుల నివారణకు మాత్రలు
మంచిర్యాలటౌన్: 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివా రణ మాత్రలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11న జిల్లాలోని దాదాపు 1,58,480 మంది పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. 930 అంగన్‌వాడీ కేంద్రాలు, 650 మంది ఆశా కార్యకర్తలు, 17 ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు, 149 ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్ర భుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు జూని యర్ కళాశాలల్లో మాత్రలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లల్లో నట్టలు ఉండడం వల్ల రక్తహీనత, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, పోషకాహారంతో బాధపడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, డీపీహెచ్‌ఎన్ పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.