
దూడ మృతితో.. తల్లడిల్లిన ఆవు
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మూడురోజుల వయస్సు ఉన్న లేగదూడ ను బస్సుఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ దూడను చూసి ఆవు తల్లడిల్లింది. బ స్టాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏ ర్పాటు చేశారని హడావుడి చేసిన ఆర్టీసీ ట్రా ఫిక్ ఇన్‌స్పెక్టర్, దూడ మృతికి కారణమైన వా రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని పలువురు ప్రశ్నించారు. మూడురోజుల క్రి తం రోడ్డుపై దూడ ప్రసవించిన ఆవును యజ మానికి చేరవేయాలని సోషల్‌మీడియాలో షేర్‌చేసిన సమయంలో స్పందించి ఉంటే దూడ మృతిచెందేది కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మృతిచెందిన దూడను బజరంగ్‌దళ్, ఏబీవీపీ కార్యకర్తలు బైక్‌పై తరలించారు.