తండ్రి పేరిట పట్టా చేయలేదని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తండ్రి పేరిట పట్టా చేయలేదని ఆత్మహత్య

Aug 8 2025 8:59 AM | Updated on Aug 8 2025 8:59 AM

తండ్ర

తండ్రి పేరిట పట్టా చేయలేదని ఆత్మహత్య

తలమడుగు: వారసత్వంగా ఉన్న భూమిని తండ్రి పేరిట పట్టా చేయలేదని మనస్తాపం చెందిన యువకుడు వాగులో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మండలంలోని సుంకిడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుంకిడి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్‌ (30), సుజాత దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. తన తాత పేరు మీద ఉన్న భూమి వారసత్వంగా వచ్చిన 7.5 ఎకరాల వ్యవసాయ భూమిని పెద్దనాన్న దాసరి లింగన్న పట్టా చేసుకున్నాడు. ఈక్రమంలో ప్రశాంత్‌ నిత్యం మద్యం తాగి వచ్చి ఆ భూమిని తండ్రి ఏర్రన్న పేరిట పట్టా చేయాలని పెద్దనాన్నతో గొడవ పడుతుండేవాడు. పట్టా ఉండి ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని తల్లిదండ్రులతో గొడవపడేవాడు. అయినా పెద్దనాన్న పట్టా చేయకపోవడంతో బుధవారం ఉదయం మద్యం తాగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రయిన రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం సుంకిడి సమీపంలోని వాగులో మృతదేహం తేలింది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రశాంత్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.

ఉరేసుకుని యువకుడు..

నిర్మల్‌టౌన్‌: జిల్లాకేంద్రంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ కథనం ప్రకారం..ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కోడర్‌ గ్రామానికి చెందిన కృష్ణ (22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. నాలుగో సంవత్సరంలో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెందాడు. తండ్రి గంగన్న ధైర్యం చెప్పాడు. 20 రోజుల క్రితం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఈనెల 5న తిరిగి వస్తున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. ఈక్రమంలో బుధవారం నిర్మల్‌లో ఆగి ఓ లాడ్జిలో రూం అద్దెకు తీసుకున్నాడు. అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఇలేగాంలో వృద్ధ్దుడు..

భైంసారూరల్‌: మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన అవదూత్‌ పాపన్న(85) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు శంకర్‌ తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. అవదూత్‌ పాపన్న భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడి వద్ద ఉంటున్నాడు. గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు స మాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించా రు. మృతుడి కుమారుడు అవదూత్‌ శంకర్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై వ్యక్తి..

సిర్పూర్‌(టి): మండలకేంద్రంలోని డౌనల్‌ ప్రాంతానికి చెందిన పందిర్ల శంకర్‌(45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్‌ కథనం ప్రకారం.. పందిర్ల శంకర్‌ మంగలిషాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండేళ్లుగా మద్యానికి బానిసై షాపు నడిపించడం లేదు. మద్యం మత్తులో బుధవారం రాత్రి ఇంటికి వచ్చి ముందు ఉన్న షెడ్డుకు ఉరేసుకున్నాడు. పిల్లలు లోపలి నుంచి చూసి అరిచారు. శంకర్‌ తండ్రి నాగయ్య వచ్చి చూసేసరికి ఉరేసుకుని ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తండ్రి పేరిట పట్టా చేయలేదని ఆత్మహత్య1
1/1

తండ్రి పేరిట పట్టా చేయలేదని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement