
సరస్వతి కెనాల్‌కు నీటి విడుదల
సోన్: ఎస్సారెస్పీ సరస్వతి కాలువ ద్వారా నీటిని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గురువారం దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. సరస్వతి కెనాల్ పరివాహక ప్రాంత రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ సురేష్, ఈఈ అనిల్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, చిన్నయ్య, నాయకులు రావుల రాంనాథ్, సరికెల గంగన్న, హరీశ్‌రెడ్డి, రమేశ్, రాజేశ్వర్, ముత్యంరెడ్డి, నర్సారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సాగర్, అశోక్, ఉదయ్, జీవన్‌రెడ్డి, నవీన్, నరేశ్, సాయన్న, సంతోష్, గంగారెడ్డి, గంగయ్య, నాగయ్య, సాయినాథ్, నర్సయ్య, గణేశ్, నాగరాజ్, భూమేశ్, ప్రశాంత్ ఉన్నారు.
చెట్లు నరికిన ఐదుగురిపై కేసు●
జన్నారం: జన్నారం అటవీ రేంజ్ పైడిపల్లి బీట్‌లో అక్రమంగా టేకు చెట్లు నరికిన ఐదుగురిపై కేసు నమోదు చేశామని రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. చెట్లు నరుకుతున్నారనే సమాచారంతో సెక్షన్ అధికారి శివకుమార్ సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి తనిఖీ చేపట్టారు. దుంగలతో వస్తున్న ఐదుగురిని పట్టుకునేందుకు వెళ్లారు. వారిని గమనించిన మైనేని తిరుపతి, డేగ మహేశ్, మైనేని సురేశ్, ఎండీ తహార్ పాషాలు దుంగలు పడేసి పరారీ అయ్యారు. మరొకరు కండ్లె కమలాకర్‌ను పట్టుకుని ఎఫ్‌ఎస్‌వో శివకుమార్, బీట్ అధికారి లాలుబాయి, కానిస్టేబుల్ చంద్రమౌళి గురువారం తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.

సరస్వతి కెనాల్‌కు నీటి విడుదల