
ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి
శ్రీరాంపూర్: ఇప్పటివరకు జరిగిన డైరెక్టర్ (పా), సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశాల్లో జరిగిన ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీచేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కోరారు. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్.బలరాం నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ చర్చల్లో అవగాహనకు వచ్చి ఒప్పందం చేసుకున్న ప్రతీ డిమాండ్ నెరవేర్చాలన్నారు. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్లు మెడికల్ అన్‌ఫిట్ అయితే వారికి సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ కల్పించడానికి ఒప్పందం జరిగిందని దీన్ని అమలు చేయాలన్నారు. ఈపీ ఆపరేటర్ల సమస్య, ప్రమోషన్లు, మారుపేర్ల సమస్య ఇంకా ఇతర డిమాండ్లపై చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటీవల మెడికల్ బోర్డులో అర్హులైన వారికి న్యాయం జరగలేదనితిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.