
అదుపుతప్పి ఆటో బోల్తా..●
● మహారాష్ట్ర కూలీలకు గాయాలు
కుంటాల: అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన పదిమంది కూలీలకు గాయాలయ్యాయి. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన దత్తనగర్‌తండాకు చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు బుధవారం ఆటోలో కుంటాలకు బయలుదేరారు. దౌనెల్లితండా వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో డ్రైవర్ ఇందల్‌తో పాటు కూలీలు జీవంత్‌రావు, రాథోడ్ కవితరాం, శాంతాబాయి, శేషారావు, లక్ష్మి, లత, పూర్ణిమ, సక్కుబాయికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.