
ముగిసిన సీఆర్టీల డెమో ప్రక్రియ
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని పీఎంఆర్సీ భవనంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీఆర్టీ అభ్యర్థుల డెమో ప్రక్రియ సజావుగా ము గిసిందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. బుధవారం డెమో ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ 6 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ పోస్టులను భర్తీ చేసేందుకు డెమో ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. 96 మంది అభ్యర్థులకుగానూ 90 మంది హాజరైనట్లు తెలిపారు. తుది జాబితాను ప్రకటించి ఖాళీగా ఉన్న పోస్టులలో నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీడీటీడబ్ల్యూ అంబాజీ, ఆసిఫాబాద్ డీడీటీడబ్ల్యూ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.