
లారీ బోల్తా
తాంసి: మండలంలోని బండల్‌నాగాపూర్, పొ చ్చర గ్రామాల మధ్య బుధవారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర గ్రామం నుంచి తాంసి మండలంలోని కప్పర్ల వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారింది. బుధవారం ఇదే రోడ్డుపై వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.