
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 8వ సబ్ జూనియర్ ఆత్య–పాత్య జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన ఏడుగురు బాలురు, ఏడుగురు బాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో అత్యా–పత్యా జిల్లా అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి ఉప్పలయ్య, కనపర్తి రమేశ్, సంతోష్, దేవేందర్, వర్ష, తదితరులు పాల్గొన్నారు.