
పర్వతారోహణకు కార్తీక్●
● ఈ నెల 9నుంచి మౌంట్ యూనమ్‌కు సాహస యాత్ర
కెరమెరి: కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని కెలికే గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్ ఈ నెల 9 నుంచి 19 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పీటీవ్యాలీలో నిర్వహించనున్న మౌంట్ యూనమ్ పర్వతారోహనకు బుధవారం బయలుదేరి వెళ్లాడు. 9 నుంచి పర్వతా రోహణ ప్రారంభించనున్నాడు. సాహస యాత్ర 6,111 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ యూనం వరకు శిఖ రోహణ కొనసాగుతుంది. సుమారు పది రో జులపాటు కొనసాగే ఈ సాహస యాత్రకు సికింద్రాబాద్‌కు చెందిన గ్లోబల్ హిందూ ఫెడరేషన్, ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ప్రత్యామ్నాయంగా మౌంట్ కానామో శిఖరంతో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఈడీలో ప్రవేశ గడువు పొడిగింపు
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీఈడీ కళాశాలలో 2025–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికిగానూ దరఖాస్తు గడువును ఈ నెల 8 నుంచి 14 వరకు పొడిగించినట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కౌన్సెలింగ్ తేదీ ఈనెల 14 నుంచి 21వ తేదీకి మార్చినట్లు ఆమె పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అసభ్యకర పోస్టులు పెడుతున్న ఒకరి అరెస్టు
నస్పూర్: చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలిపారు. బుధవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ తాళ్లపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన కర్రు సందీప్ చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తుండడంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్, సైబర్ సెక్యురిటీ సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్సై ఉపేందర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
టీఎంసీకి షాకాజ్ నోటీసు జారీ
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీ మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్(టీఎంసీ) రామకృష్ణకు బుధవారం జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీఎంసీ వేధింపులకు గురి చేస్తున్నారని చెన్నూర్ మెప్మా సభ్యులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. షోకాజ్ నోటీసులపై మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ ఆర్పీలను కార్యాలయానికి పిలిచి విలేకరులకు తమ విషయం చెప్పలేదని రాసివ్వాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇదే విషయమై గురువారం ఆర్పీలతో కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

పర్వతారోహణకు కార్తీక్●