
పరిహారం చెక్కు అందజేత
లక్సెట్టిపేట: జెండావెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తలమల గ్రామ అటవీ శివారులో ఈ నెల 5న చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం యజమాని పూసం లచ్చుకు రూ.12 వేల పరిహారం చెక్కును ఒక్కరోజులోనే అందజేసినట్లు రేంజి అధికారి అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, ఎఫ్‌బీవో చంద్రశేఖర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
8న ఆర్జీయూకేటీలో ఐదోవిడత కౌన్సెలింగ్
బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాలకు సంబంధించిన స్పోర్ట్స్, ఎన్‌సీసీ, జనరల్ కోటా అభ్యర్థులకు ఈనెల 8న ఐదోవిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అర్హత పొందిన అభ్యర్థులు నిజధ్రువీకరణ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.rgukt.ac.in ను సందర్శించాలన్నారు.