
‘పోడు’పై హక్కుల కోసం పాదయాత్ర
చింతలమానెపల్లి: పోడు భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని దిందా గ్రామస్తులు బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. పోడు భూముల సాధన ర్యాలీ పేరుతో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు బయలు దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులో ఉన్న భూముల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అటవీశాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తూ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను రాజధానిలో తెలియజేసేందుకు పాదయాత్రగా బయలుదేరామన్నారు. తమ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు పోరాడుతామన్నారు.