
పనులు త్వరగా పూర్తిచేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● భవన నిర్మాణాల పరిశీలన ● వసతిగృహ పర్యవేక్షకులతో సమీక్ష
భీమిని: కన్నెపల్లి మండలంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణ పనులు త్వరగా పూ ర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం భీమిని, కన్నెపల్లి మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. భీమి నిలో పీహెచ్‌సీని తనిఖీ చేశారు. మందుల నిల్వలు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని వై ద్య సిబ్బందికి సూచించారు. అనంతరం మల్లీడి గ్రా మంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బి ల్లులు త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లీడిలోని నర్సరీ పరిశీ లించి మొక్కల నిర్వహణ సరిగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమిని, కన్నెపల్లి కేజీబీవీలను సందర్శించారు. వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. కలెక్టర్ వెంట ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్వోలు పద్మ, శారద తదితరులున్నారు.
భవన నిర్మాణ స్థల పరిశీలన
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి రాంనగర్ బస్తీలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవ నం శిథిలావస్థకు చేరుకోగా నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పాఠశాల భవన నిర్మాణానికి ప్రతి పాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిథిల భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించి వాటిని వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.
క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను సంబంధిత అధికారులు క్రమంతప్పకుండా తనిఖీ చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ చాంబర్‌లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, వసతి గృహాల పర్యవేక్షక అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు నెలకోసారైనా వసతిగృహాన్ని సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యలుంటే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.