రైతులకు యూరియా కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

రైతులకు యూరియా కొరత లేదు

Aug 6 2025 6:52 AM | Updated on Aug 6 2025 6:52 AM

రైతులకు యూరియా కొరత లేదు

రైతులకు యూరియా కొరత లేదు

లక్సెట్టిపేట/మందమర్రిరూరల్‌/దండేపల్లి: రైతుల కు యూరియా కొరత లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొరత ఉన్నట్లు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు దండేపల్లి మండలం గూడెం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు రఘునాథ్‌, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ఎస్‌పీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన రైతు సమ్మేళనం, మందమర్రి పా తబస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. కేంద్రం నుంచి 12లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందిస్తోందని, కాంగ్రెస్‌ అబద్ధాలు ఆడుతూ రైతులను తప్పుదారి పట్టిస్తోందని తెలిపా రు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న ట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ రైతులకు ఏం చేయలేదని, ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యం

చెన్నూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీతో అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ఈవీఎం ఓటింగ్‌ ద్వారా మోసం జరిగిందని మాట్లాడుతోందని, మరి ఆ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో కూడా మోసం జరి గిందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ లు ముస్లిం రిజర్వేషన్‌ విషయంలో ఏకతాటిపై ఉ న్నాయని, వారి అవగాహన బయటపడుతోందని తెలిపారు. దేశంలో నక్సలిజాన్ని అంతమొదిస్తామ ని, ఇప్పటికై నా ప్రాణాలు దక్కాలంటే నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. మంత్రి వివేక్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు రఘునాథ్‌రావు, మాజీ ఎంపీ వెంకటేశ్‌నేత, శ్రీదేవి, నాయకులు గోమాస శ్రీనివాస్‌, లింగయ్య, దుర్గం అశోక్‌, దీక్షితులు, ఆరుముల్ల పోశం పాల్గొన్నారు.

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానం

మంచిర్యాలక్రైం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సన్మానించారు. ఆయన మాట్లాడు తూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండవరం జగన్‌, ఉపాధ్యక్షుడు భుజంగరావు, జనరల్‌ సెక్రెటరీ మురళీకృష్ణ, న్యాయవాది తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement