
ఉపాధ్యాయుల పనితీరు భేష్
జన్నారం: విద్యార్థుల సంఖ్య పెంచి, నాణ్యమైన వి ద్యనందించడంలో ఉపాధ్యాయుల పని తీరు అభినందనీయమని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో దిక్చూచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికా నుంచి అమలు చేస్తున్న డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిష్టాపూర్ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటిస్థానంలో ని లవడం అభినందనీయమని కొనియాడారు. మారుమూల గ్రామ ప్రాథమిక పాఠశాలలో అమెరికా నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. గుణాత్మకమైన, సాంకేతికమైన, శాసీ్త్రయమైన విద్యను అందించేందుకు ఈ కార్యక్రమం సౌకర్యవంతంగా ఉంటుంద ని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు, వి ద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఈవో విజయ్‌కుమార్, హెచ్‌ఎంలు రామన్న, సుధాకర్‌నాయక్, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.