
శిశుమందిరాల్లో విద్యతోపాటు క్రమశిక్షణ
● ఎమ్మెల్యే రామారావు పటేల్ ● రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్ పోటీలు ప్రారంభం
భైంసాటౌన్: విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశం పట్ల భక్తిభావన పెంపొందించడంలో సరస్వతి శిశుమందిరాలు విశేష కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని కిసాన్‌గల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో మంగళవారం రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమేనన్నారు. కార్యక్రమంలో విద్యాపీఠం ప్రాంత అధ్యక్షుడు తిరుపతిరావు, సంఘటన కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్ కృష్ణమాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.