
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై మజారొద్దీన్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని భగవంతంవాడకు చెందిన గోపు సత్యనారాయణ, భారతమ్మ దంపతుల కుమార్తె నీలిమ (37)కు గద్దెరాగడికి చెందిన లారీ డ్రైవర్ మానేం రాజేందర్‌తో వివాహమైంది. దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. సదరు మహిళ కొంతకాలంగా కడుపునొప్పి, గర్భసంచి సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇటీవల తల్లిగారింటికి వచ్చింది. ఈ నెల 3న పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందింది. మహిళ తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.