
నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
దండేపల్లి: నేతకానీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన నేతకానీ మహర్ సంక్షేమ సంఘం మండల సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ప్రకటించాలని, నామినేటెడ్ పదవుల్లో ప్రత్యేక స్థానం కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమల్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశ్, నర్సయ్య, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యువరాజు, జిల్లా అధ్యక్షుడు రాంబాబు, నాయకులు శ్రీనివాస్, రాములు, రాజలింగు, పోశన్న, తదితరులు పాల్గొన్నారు.