
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీసుస్టేషన్ పరిధిలోని అందుగులపేట మేడారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం రాత్రి 10.30గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారపు వంశీ(32) మృతిచెందాడు. మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్‌కు చెందిన వంశీ తన భార్య స్వాతితో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తగారి ఊరైన తాండూర్‌కు వెళ్తున్నాడు. అందుగులపేట వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉంచగా.. వెనుక నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. వంశీకి భార్య స్వాతి, కుమారుడు ఉన్నారు.