
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
ఇంద్రవెల్లి: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దొడందా గ్రామంలోని మెస్రం తుల్సిరాం అనే రైతుకు చెందిన ఎద్దు మంగళవారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మేత మేస్తుండగా ఎర్తింగ్ వైర్‌కు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ రూ.40 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎర్తింగ్ వైర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఎద్దు మృతి చెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.